J.SURENDER KUMAR,
విద్య, వైద్య రంగాల్లో విశేషమైన సేవలు అందిస్తున్న క్రైస్తవ మిషనరీలు ఇకనుంచి సమాజానికి నష్టం చేస్తున్న మాదక ద్రవ్యాలను రూపు మాపడంలోనూ తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
👉కల్వరి టెంపుల్ చర్చ్ పాస్టర్ డాక్టర్ పి. సతీష్ కుమార్ వాక్యపరిచర్యలో 35 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కృతజ్ఞత మహిమోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.

👉యువత వ్యసనాలకు బానిస కావడం వల్ల సమాజానికి తీరని నష్టం వాటిల్లుతుందని, మాదక ద్రవ్యాలను రూపుమాపడంలో ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ దైవ సేవకుల సందేశాల్లోనూ ఈ అంశాన్ని ఒక బాధ్యతగా తీసుకుని మార్గనిర్దేశం చేయాలని కోరారు.
👉భారతదేశం మత సామరస్యానికి ప్రతీక. ఎవరికి ఏ విశ్వాసంపై నమ్మకం ఉంటుందో ఆ విశ్వాసం ప్రకారం నడుచుకునే స్వేచ్ఛ ఉందని అన్నారు. ఆ స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, రాష్ట్రంలో మత వివక్షకు తావు లేదని అన్నారు.

👉క్రైస్తవ మిషనరీస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న విద్యా సంస్థలు, ఆస్పత్రులు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. భారతీయ సంస్కృతి ఎంతో బలమైనదని, కుల, మతాలకు అతీతంగా ఇక్కడ అందరికీ గౌరవం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.