మహిళల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో గర్భిణీలు బాలింతలు మహిళల సంక్షేమమే మా ఇందిరమ్మ రాజ్య ప్రభుత్వ లక్ష్యం అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామంలో ₹ 12 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి మరియు గాదేపెల్లి గ్రామంలో ₹ 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన పంచాయితీ కార్యలయ భవన నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు.


అనంతరం అంగన్వాడీల ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్న పిల్లల అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.


మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రాంట్ కింద మంజూరైన దొంతాపూర్ గ్రామ నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి, మరియు గాదెపల్లి గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకోనున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమం మా లక్ష్యం అన్నారు. దొంతపూర్ మరియు గాదెపల్లె గ్రామాలకు చెందిన ప్రతి సమస్యను పరిష్కరిస్తమని, ఈ ప్రాంతానికి సంబంధించిన లిఫ్ట్ ల నిర్వహణ గురించి అధికారులతో మాట్లాడటం జరిగిందని, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ విషయంలో కూడా గ్రామ సభ నిర్వహించి అర్హులైన పేదవారికి ఇండ్లను పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు


ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.