👉 రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాం !
👉 ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం !
👉 మా పది నెలల పాలనలో యాబై వేలమందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం !
👉 ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు !
J.SURENDER KUMAR,
మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తూ పది నెలల మా ప్రభుత్వ పాలనలో దాదాపు యాబై వేలమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని, మా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు ₹ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నామని, శాసనసభ వ్యవహారాలు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
👉 మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశంలో ప్రధాన అంశాలు.
👉 ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాం
👉 ఆగస్టు 15 నాటికి ₹18 వేల కోట్ల రుణమాఫీ చేసాం. బ్యాంకు ఖాతా సాంకేతిక సమస్య పరిష్కారం చేసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తూనే ఉన్నాం !
👉 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు 90% అమలు చేశాం!
👉మహిళలకు ₹ 500 లకే గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం !
👉 కోటి 20 లక్షల మంది మహిళలకు ఉచిత బస్సులలో ప్రయాణిస్తున్నారు !
👉 వరి ధాన్యం కు గిట్టుబాటు ధర కల్పిస్తూ కొనుగోలు చేస్తున్నాం !
👉 సన్న వడ్లకు ₹ 500/- బోనస్ చెల్లిస్తున్నాం. ఎకరాకు దాదాపు 20 క్వింటాళ్లు పండించిన రైతుకు ₹ 10,000/- ఖాతాలో జమ అవుతున్నాయి.
👉 గత పది సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఆర్థిక క్రమశిక్షణకు తూట్లు పొడిచారు.
👉 గత 10 సంవత్సరాల ప్రభుత్వ పాలకులు 70 సంవత్సరాలు జరగని అభివృద్ధి ఇప్పుడే పుట్టిన మా ప్రభుత్వం ఎలా చేస్తుందని అనేవారు !
👉 పది నెలల మా కాంగ్రెస్ పాలన పై మీరు అభివృద్ధి సంక్షేమం అడ్డుకుంటూ ఆరోపణలు చేయడం ఇది ఏం సంస్కృతి !
👉 ప్రభుత్వ పాలనలో పది సంవత్సరాల అనుభవము ఉందని చెప్పుకునే ప్రతిపక్ష పార్టీ నాయకులు మా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ అభివృద్ధిని సంక్షేమాన్ని అడ్డుకోవడం ఏమిటి ?
👉 మా ప్రభుత్వ నాలుగు సంవత్సరాల కాలంలో అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలతో ముందుకు వెళ్తాం.