మరమ్మతులకు 68 లక్షల రూపాయల నిధులు !

👉గత ప్రభుత్వ పెండింగ్ బిల్లులకు మోక్షం !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


నియోజకవర్గంలోని 34 చర్చిల మరమ్మతు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ₹ 68 లక్షల నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం శుక్రవారం 34 చర్చలకు వర్క్ ఆర్డర్లను పాస్టర్లకు ఎమ్మెల్యే అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
జి.ఓ నెం.75 ద్వారా 2022 లో 47 చర్చిలకు గాను ₹ 96.50 లక్షల రూపాయలను గత ప్రభుత్వంలో మంజూరు చేసిందన్నారు. పనులకు వర్క్ ఆర్డర్ లేకపోవడంతో 34 చర్చిలకు కేటాయించిన ₹68 లక్షల నిధులు లాప్స్ అయ్యాయన్నారు.


కొందరు పనులు చేసిన బిల్లులు రాక, చర్చిలు మరమ్మత్తులకు నోచుకోలేక ఇబ్బందులు పడుతున్న చర్చి పాస్టర్లు, వారి అభ్యర్థన మేరకు జిల్లా కలెక్టర్ తో, సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో చర్చించి పరిస్థితిని వివరించి లాప్స్ అయిన నిధులు ₹ 68 లక్షల నిధులు ప్రభుత్వం నుంచి విడుదల చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు.


పనులు పూర్తి అయిన చర్చలు ఉన్నాయని, మిగిలిన వాటికి వర్క్ ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుందని, ఇంకా ఎవరికైనా డబ్బులు రానివారు ఉన్న. ఇచ్చిన జాబితాలో ఎవరి చర్చి అయినా లేకపోయినా ప్రభుత్వంతో మాట్లాడి అట్టి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.