J.SURENDER KUMAR,
మత్స్యకారుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం గంగపుత్రులు, ముదిరాజులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో వెల్గటూర్ మండలం కోటిలింగాల లో గురువారం వందశాతం రాయితీ పైన ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
మత్స్య రంగానికి సంబంధించి చేప పిల్లల పెంపకానికి కొంత భూమి అవసరం ఉందని మరియు తదితర సమస్యలు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని,వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కారం చేస్తా అన్నారు.
👉కొనుగోలు కేంద్రాలు ప్రారంభం !

వెల్గటూర్ మండలం వెంకట్రావుపేట, ముత్తునూర్ గ్రామాలలో సింగిల్ విందు ఆద్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు,.మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,.అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు