ముగిసిన జువ్వాడి సూర్యరావు అంత్యక్రియలు !

👉అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రభుత్వ విప్!


J.SURENDER KUMAR,


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి సూర్య రావు అంత్యక్రియలు స్వగ్రామం తిమ్మాపూర్ లో ఆదివారం జరిగాయి. అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మంచిర్యాల్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గోడిసెల రాజేశం గౌడ్, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావసంత, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ తదితర అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు వందలాది మంది న్యాయవాదుల తో పాటు పలు గ్రామాల నుండి వేలాది మంది ప్రజలు తరలివచ్చి సూర్యారావు కు మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.


సూర్యారావు చితికి పెద్ద కుమార్తె జస్టిస్ శ్రీదేవి తలకొరివి పెట్టారు. బూరుగుపల్లి రామయ్య పల్లె మధ్య వాహనాల పార్కింగ్ తో జామ్ ఏర్పడింది అదనపు పోలీస్ బలగాలు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ ను నియంత్రించారు.