నటి శిల్పాశెట్టి భర్త కేసు పేరుతో ధర్మపురిలో సైబర్ నేరం!

👉ఇడి అటాచ్ చేసిన కోట్లది రూపాయలు మీ ఖాతాలో ఎలా ఉన్నాయి ?


👉ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  అధికారి అంటూ ఫోన్ చేసి డబ్బులు స్వాహా !


.J.SURENDER KUMAR,


గత మూడు రోజుల క్రితం ధర్మపురి పట్టణంకు చెందిన ఓ అధికారికి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా బ్యాంకు ఖాతా నుంచి మీ ఖాతాలోకి కోట్లది రూపాయలు ఎలా వచ్చాయి అంటూ సైబర్ మోసగాళ్లు వేలాది రూపాయలు దోచుకున్న  సంఘటన ఇది.


కొంతకాలంగా సైబర్ నేరగాళ్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను టార్గెట్ చేసి మోసాలు చేస్తున్న  విషయం తెలిసిందే. ఓ ఎమ్మెల్యేకు డబ్బులు  డిమాండ్ చేస్తూ ఫోన్ లో బెదిరింపు, మరో ఎమ్మెల్యే కు మహిళ న్యూడ్ గా వీడియో కాల్ చేయడం ఈ సంఘటనలపై కేసులు నమోదు అయినా విషయం తెలిసిందే.


హలో…. 
శిల్పాశెట్టి భర్త అక్రమ ఆస్తుల వివాదంలో అతడికి సంబంధించిన ₹ 6 కోట్ల నగదు నీ ఖాతాలో  జమ ఎలా అయ్యాయి. ? అంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాను అని పట్టణానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన అధికారికి  సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

👉  వివరాలు ఇలా ఉన్నాయి…


ధర్మపురి పట్టణంలో ఆర్థిక సంక్షేమ లావాదేవీలు నిర్వహించే సంస్థ కీలక అధికారికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి I.O.( ఇన్వెస్టిగేషన్ అధికారి) మాట్లాడుతున్నాను అని మూడు రోజుల క్రితం ఫేక్ ఫోన్ కాల్ వచ్చింది.

👉ఫోన్లో మాటల సారాంశం….

మేము విచారణ చేస్తున్న శిల్పాశెట్టి భర్త, రాజ్ కుంద్రా ₹ 6వేల కోట్ల బిట్‌కాయిన్ మోసం కేసులో మీ ఖాతాకు అతని సంస్థ నుంచి ₹ 6 కోట్ల రూపాయలు  ఎందుకు బదిలీ చేశారు ?  అంటూ ఫైబర్ మోసగాళ్లు అధికారిని విచారణ పేరుతో ఫోన్ లో ప్రశ్నించినట్టు సమాచారం. దాదాపు నాలుగు గంటల పాటు అధికారిని వివరాలు, విచారణ పేరిట సైబర్ మోసగాళ్లు భయభ్రాంతులకు గురి చేసినట్లు తెలిసింది.


( ఆడియో ఫోన్ కాల్ చేసారా  ?  వీడియో ఫోన్ కాల్ చేశారా ? అనే విషయం తెలియాల్సి ఉంది)


కేసు ఫైలింగ్ చార్జీల పేరుతో నో,  ప్రాథమిక నివేదిక వివరాల ఫైలింగ్ చార్జీల పేరిటనో, తెలియదు కానీ, రెండు విడతల వేలాది రూపాయలు వారు చెప్పిన బ్యాంక్ అకౌంట్ కు  తన ఖాతా నుండి అధికారి బదిలీ చేసినట్టు సమాచారం.
E.D పేరిట ఫోన్ కాల్ రావడంతో భయాందోళనకు గురి అయిన అధికారి తన సహచర ఉద్యోగులకు ఫోన్ కాల్ ఉదంతం వివరించినట్లు తెలిసింది.

స్పందించిన ఉద్యోగులు, ‘ సార్ ఇది సైబర్ మోసగాళ్ల పని ఉంటుంది.అని  వారు అధికారికి వివరించి అధికారి వెంట వెళ్లి  పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

👉 కార్పొరేట్  రంగంలో సంచలనం సృష్టించిన కేసు. కావడంతో…...

నటి శిల్పాశెట్టి భర్త  ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు చెందిన కోట్లాది రూపాయల విలువైన స్థిరాస్తులను, 2024 ఏప్రిల్ లో  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాత్కాలికంగా జప్తు చేసిన  విషయం తెలిసిందే. కార్పొరేట్ వ్యాపార రంగంలో ఈ  కేసు సంచలనం సృష్టించింది. దీనికి తోడు జాతీయ అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు రావడంతో ఈ కేసుకు విస్తృతస్థాయి ప్రచారం లభించింది.

👉 దుబాయ్ పోలీసులము అంటూ…

దుబాయ్ నుంచి  పోలీసులము మాట్లాడుతున్నాం, నీ కొడుకు నేరం చేసి మా జైల్లో ఉన్నాడు అని  కొన్ని రోజుల క్రితం  ధర్మపురి పట్టణం కు చెందిన వ్యక్తికి ఫోన్ కాల్ వచ్చినట్టు సమాచారం. అతడి కుమారుడు  కొన్ని నెలల క్రితం దుబాయ్ కి వెళ్లినట్టు తెలిసింది. 

సైబర్ మోసగాళ్లు జైల్లో చిత్రహింసలు పెడుతున్నట్టు శబ్దాలు, యువకుడి  ఏడుపులు అరుపులను, సైబర్ నేరగాళ్లు ఫోన్ ద్వారా తండ్రికి వినిపించినట్టు సమాచారం. కేసు నుంచి తప్పించడానికి లక్ష రూపాయలు డిమాండ్ చేసి వారు తమ బ్యాంక్ ఎకౌంటు బదిలీ చేయించుకున్నట్లు తెలిసింది.

కొంత సమయం తర్వాత దుబాయ్ లో ఉన్న తన కొడుకు సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన తండ్రి ఫోన్ చేయగా నాన్న నేను సైట్ మీద పనిచేస్తున్నాను అని తండ్రికి చెప్పినట్టు సమాచారం.. తనకు వచ్చిన ఫోన్ కాల్ వివరాలు కుమారుడికి వివరించి. పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది.


ఇదిలా ఉండగా జగిత్యాల పట్టణం కు చెందిన ఓ అధికారికి  సైబర్ మోసగాళ్లు రెండు రోజుల క్రితం సాయంత్రం ఫోన్ చేసి. మీ కూతురు ఆ సాంఘిక కార్యకలాపాలలో పట్టుబడింది అంటూ చెప్పడంతో , సైబర్ మోసగాళ్లు చేస్తున్న ఫోన్ కాల్ గా అధికారి గుర్తించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు సమాచారం. ఈ సంఘటన పై  మౌఖిక ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.