నేటి నుంచి ధర్మపురిలో క్షేత్రంలో గోదావరి నది కి హారతి !

👉డిసెంబర్ 1 వరకు నెలరోజుల పాటు !

👉ప్రతిరోజు గోదావరి నదికి హారతి !


J.SURENDER KUMAR,


ధర్మపురి క్షేత్రంలోని గోదావరి నదికి శనివారం నుంచి నెలరోజుల పాటు సాయంత్రం హారతి కార్యక్రమం ప్రారంభం కానున్నది.


కార్తీక పర్వ మాసం పురస్కరించుకుని  02-11-2024 శనివారం నుండి 01-12-2024 వరకు గోదావరి నదికి హారతి  కార్యక్రమం ప్రతి నిత్యం సాయంత్రం కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

గోదావరి హారతి (ఫైల్ ఫోటో)


శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుండి సాయంత్రం మేళతాళాలతో అత్యంత వైభవంగా మహిళలు గ్రామస్థులు , సేవా సంస్థలచే గోదావరి నదికి ఊరేగింపుగా వెళ్లి గోదావరి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హారతి నిర్వహించనున్నారు.

👉బ్రహ్మ పుష్కరిణిలో..

తేది 15-11-2024 శుక్రవారం  బ్రహ్మ పుష్కరిణిలో (కోనేరులో) పంచసహస్రదీపాలంకరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.


👉 ఆలయంలో లక్ష్మీ పూజలు


దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం లోని అద్దాలమండపంలో శ్రీ లక్ష్మి పూజ కార్యక్రమాలు లక్ష్మీసూక్తంతో , పురుషసూక్తంతో అత్యంత  వైభవంగా అర్చకులు వేద పండితులు ఘనంగా నిర్వహించారు.


ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ప్రదాన దేవాలయం లో గల అభిషేకం మండపంలొ సహస్ర దీపాలంకరణ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు.


  కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సంగి సత్తెమ్మ , సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాస్, అర్చకులు నంభి నరసింహ మూర్తి , చక్రపాణి కిరణ్ కుమార్  , అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్  మరియు భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు .