నియామక పత్రాలు అందించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


అంగన్వాడి కేంద్రాలలో ఆయాలు గా విధులు నిర్వహిస్తూ టీచర్లు గా పదోన్నతులు పొందిన వారికి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం నియామక పత్రాలు అందించారు

ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
నియోజకవర్గంలోని గొల్లపల్లి, వెంగళాయిపేట, బతికపల్లె, లింగాపూర్ గ్రామాలలో అంగన్వాడీ ఆయలుగా గతంలో వారు విధులు నిర్వహించారు. వారికే నియామక పత్రాలు అందించారు

ఆయా కేంద్రాల టీచర్లు పదవి విరమణ పొందడంతో అదే అంగన్వాడీ కేంద్రాలలోనే ఆయాలు టిచర్లుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పదోన్నతి పొందిన అంగన్వాడి టీచర్లకు శుభాకాంక్షలు తెలిపారు.