J. SURENDER KUMAR,
ధర్మపురి మండలం రాజారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యావసరాల కోసం పాఠశాల పూర్వ విద్యార్థులు, 2001-02 SSC మిత్రబృందం సుమారు ₹ 30వేల రూపాయల విలువ గల స్మార్ట్ టీ.వి సోమవారం బహుకరించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాధు శ్రీకాంత్ మాట్లాడుతూ నేటికాలంలో సాంకేతిక సాధనాల వాడకం అనివార్యమని, వాటి వినియోగం వల్ల విద్యార్థుల అభ్యసన మెరుగవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు కొలిచాల శ్రీనివాస్, రాజారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రావులపెల్లి వెంకటరమణ, అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మన్ లక్ష్మి, ప్రజాప్రతినిధులు సౌల్ల నరేష్, ఎ.మహేందర్, రంగు అశోక్, బండారి మురళి, పాఠశాల పూర్వ విద్యార్థులు,2001-02 SSC బ్యాచ్ మిత్రబృందం, పాఠశాల ఉపాధ్యాయ బృందం బండారి సతీష్, చుంచుకాల శ్వేతారాణి, చల్ల కృష్ణ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.