పత్తి కి గిట్టుబాటు ధర చెల్లిస్తున్నాం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


పత్తి పంటకు మా ప్రభుత్వం గిట్టుబాటు ధర కనిపిస్తూ కొనుగోలు చేస్తున్నదని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఎండపెల్లి మండలం కొత్తపేట గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులు మండల నాయకులతో కలిసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..


కొత్తపేట గ్రామంలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం చాలా సంతోషం అన్నారు ప్రభుత్వం పత్తికి క్వింటాలుకు ₹ 7వేల 5 వందల రూపాయల మద్దతు ధరను ఇవ్వడం జరుగుతుందని, ధర్మపురి నియోజక వర్గంలో కొత్తపేట గ్రామ మిల్లును ప్రభుత్వం నోటిఫై చేసిందన్నారు. రైతులు వరి పంటతో పాటు పత్తి సాగు పైన కూడా శ్రద్ధ చూపాలని, ఎమ్మెల్యే అన్నారు.

పత్తి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, పత్తి రైతులు కూడా తేమ శాతాన్ని చూసుకొని కొనుగోలు కేంద్రానికి తేవాలన్నారు. ఎటువంటి సమస్య ఉన్న నా దృష్టికి తీసుకురావాలని ఈ సంధర్బంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు