పెళ్లి వధువును కుదుర్చులేదని మ్యాట్రిమోనీ కు జరిమానా !


J.SURENDER KUMAR,


వరుడికి తగిన వధువును గుర్తించి పెళ్లి సంబంధం కుదర్చడంలో  విఫలమైనందున మ్యాట్రిమోనీ సైట్‌కి వినియోగదారుల ఫోరం ₹ 60 వేల చెల్లించాలి అని ఆదేశించింది.


బెంగళూరు జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు రామచంద్ర ఎంఎస్, సభ్యులు నందిని హెచ్,
కుంభార్, మరియు సవిత ఐరానీలు, మ్యాట్రిమోనియల్ సైట్ ప్రచారం చేసిన సేవలను అందించడంలో లోపభూయిష్టంగా ఉందని నిర్ధారించారు.

👉వివరాలు ఇలా ఉన్నాయి


ఫిర్యాదుదారుడు , విజయ కుమార్, మార్చి 17, 2024 న దిల్మిల్ మ్యాట్రిమోనీ కార్యాలయాన్ని సంప్రదించి, 45 రోజుల్లోగా తన కుమారుడికి తగిన  పెళ్లికూతురు కనుగొంటామని హామీ ఇవ్వడంతో ₹ 30,000 చెల్లించారు.
దిల్మిల్ మ్యాట్రిమోనీ కార్యాలయానికి అనేక సార్లు వెళ్లి ఫాలో-అప్‌లు  చేసిన వెబ్‌సైట్ ఒక్క పెళ్లి సంబంధం కుదరచడంలో విఫలమైంది.


విజయకుమార్ మ్యాట్రిమోనీ కంపెనీని తో సంప్రదింపులు జరిపి  సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాడు.
వెబ్సైట్ వారు  విజయ్ కుమార్ కు సహకరించలేదు. పైగా ఆగ్రహ వేషాలతో  దూషించడం మొదలు పెట్టారు. తాను చెల్లించిన డబ్బు తిరిగి వాపస్ చేయాలని విజయకుమార్ వారిని కోరాడు. వెబ్సైట్ కంపెనీ డబ్బు ఇవ్వడానికి నిరాకరించడం తోపాటు  అనుచిత వ్యాఖ్యానాలు చేశారు.


మే 9న వెబ్‌సైట్‌కి రీఫండ్‌ను కోరుతూ విజయకుమార్  లీగల్ నోటీసు పంపాడు, అయినా వారు స్పందించలేదు. దీంతో తనకు  జరిగిన నష్టం అసౌకర్యం తాను చెల్లించిన డబ్బులు తిరిగి రాకపోవడం అదనపు పరిహారం  కోరుతూ బెంగళూరు జిల్లా  వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేశాడు.
ఫోరమ్ , దిల్మిల్ మ్యాట్రిమోనీకు నోటీసు ఇచ్చిన ఫోరమ్‌కు హాజరుకాలేదు.

ఫోరం ఆదేశాలు.


వాగ్దానం చేసిన సేవలను అందించడంలో దిల్మిల్ మ్యాట్రిమోనీ విఫలమైందని, తద్వారా సేవ లోపం, వినియోగదారుడు పోరంకు ఆధారాలు చూపించాడు. స్పందించిన వినియోగదారుల ఫోరం అధ్యక్షులు సభ్యులు దిల్మిల్ మ్యాట్రిమోనీ కి ఆదేశాలు జారీ చేస్తూ వడ్డీతో సహా ఫిర్యాదుదారుని కి ₹ 30,000 తిరిగి ఇవ్వాలని వెబ్‌సైట్‌ ను ఆదేశించింది.

అదనంగా, కుమార్‌ కు కలిగించిన అసౌకర్యానికి పరిహారంగా ₹ 20,000, మానసిక వేదనకు ₹ 5,000 మరియు వ్యాజ్యం ఖర్చులను కవర్ చేయడానికి మరో ₹ 5,000, మొత్తం ₹60,000 పరిహారం ఇచ్చింది చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.


( బార్ అండ్ బెంచ్ ) సౌజన్యంతో..