ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి !


👉కలెక్టర్ బి సత్యప్రసాద్ !


J.SURENDER KUMAR,


క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక చొరవ చూపి, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను జరిపించాలని జగిత్యాల్ కలెక్టర్ బి సత్య ప్రసాద్ వైద్య సిబ్బందిని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ బి సత్య ప్రసాద్ అధ్యక్షతన స్థానిక ఐడిఓసి కార్యాలయంలో శుక్రవారం ప్రోగ్రాం ఆఫీసర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు బస్తీ దవాఖాన లోని వైద్యాధికారులకు వైద్యారోగ్య శాఖ పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాతా శిశు సంరక్షణలో భాగంగా గర్భవతుల నమోదు కార్యక్రమం 100% నమోదు చేయాలని, అందరికీ టీ డి వ్యాక్సిన్ వేయాలని, నాలుగు ఏ ఎన్ సీ చెకప్ లు చేయించి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రసవాలు పెంచాలని అన్నారు.


గర్భిణి లను మొదటి తైమాసికంలోని నమోదు చేసి, మొదటి నుండి వారికి సరైన మార్గదర్శనం చేస్తూ సేవలు అందించడం ద్వారా నమ్మకాన్ని చూరగొని, ప్రభుత్వ ఆసుపత్రులు, సేవలపై నమ్మకం పెంపొందించి, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయ్యేలా చూడాలని తెలిపారు.
వైద్య అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతివారం సమీక్షా సమావేశం నిర్వహించి గర్భవతుల నమోదు, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డెలివరీలు ఎన్ సి డి స్క్రీనింగ్ మొదలగునవి అన్ని పారామీటర్స్ లో సమీక్ష జరపాలని ఆదేశించారు.


పుట్టిన పిల్లలందరికీ వంద శాతం వ్యాధి నిరోధక టీకాలు వేయించాలన్నారు. అభా కార్డు జనరేషన్ చాలా తక్కువగా ఉంది కావున NCD స్క్రీనింగ్ చేసేటప్పుడు, వ్యాది నిరోధక టీకాలు వేయు సమయంలో అభా కార్డు జనరేషన్ నమోదు చేయాలని ఆదేశించారు.


పర్యవేక్షకులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ఆశ మరియు ఏఎన్ఎం లకు మార్గదర్శనం చేస్తూ నిరంతరం వారినికి అందుబాటులో ఉంటూ, సేవలు పెంపొందించాలన్నారు.


జాతీయ టీ.బి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా తొందరగా వ్యాధికిస్తున్ని, గుర్తించి సరైన చికిత్స అందించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని, వ్యాది గ్రస్తులు, తొందరగా కోలుకునేలా చేయవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ప్రమోద్ కుమారు తెలిపారు. తెమడను టి. హబ్. వాహనం ద్వారా, పంపించి పరీక్ష చేయించాలని అని తెలిపారు.


వ్యాదిని నిరోధక కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించుటకు, జిల్లాస్థాయి ప్రత్యేక వర్క్ షాప్ ఏర్పాటు చేసి, లాజిస్టిక్,వ్యాధి నిరోధక కార్యక్రమాన్ని మరింత సమర్ధవంతంగా అమలు పరచడం జరుగుచున్నాదని, జిల్లా వ్యాదినిరోధక అధికారి డా. ఎ శ్రీనివాస్ తెలిపారు.

రాష్ట్రీయ బాల సంరక్షణ కార్యక్రమం క్రింద జిల్లా లోన్ అన్ని ప్రభుత్వ, ఎడేడ్ పాఠశాలల్లో చదువుచున్న విద్యార్హులకు, వైద్య పరిక్షలు నిర్వహిస్తూ చికిత్స అందించి అవసరమైతే ఉన్నత ఆసుపత్రులకు సిఫారసు చేయడం, కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలుపరుచుటకు వాహనాలు జి.పి. ఆర్. స్ సదుపాయం కలిగించి ట్రాక్ చేయడం జరుగుచున్నాదని తెలిపారు.


అసంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ద్వారా, బి.పి. షుఘర్, క్యాన్సర్ మో. వ్యాదులలో బాద పడుచున్నవారిని తొందరగా గుర్తించుటకు గాను సర్వే నిర్వహించం, సరియైన చికిత్స అందేలా చూడటం, వాతావరణ మార్పులకు అనుగుణంగా జీవన విధానాల మార్పు గూర్చి ప్రజలకు అవగాహన్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, చైతన్య పరుచడం జరుగుచున్నది అని జిల్లా అసంక్రమిక వ్యాదుల నియత్రణ కార్యక్రమ అధికారి డా. అర్చన తెలిపారు.


ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యం ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఏ శ్రీనివాస్, డా.అర్చన, మాతా శిశు ఆరోగ్య కార్యక్రం జిల్లా అధికారి డా. యం. జైపాల్ రెడ్డి , ఎన్ హెచ్ ఎం ప్రోగ్రాం అధికారి తులసి రవీందర్ , ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారు, పర్యవేక్షకులు జిల్లా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.