J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముప్పట్ల నిరంజన్ మరియు భరత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి జగిత్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పటల్ చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ధర్మపురి ఎమ్మేల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా నిరంజన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.
👉తాగునీటి సమస్య పరిష్కరించండి!

ధర్మపురి మండలం మగ్గిడి గురుకుల పాఠశాలలోనీ తాగునీరు, తరగతి గదులు మరియు పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రోజున పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందించారు.