ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేయాలి !

👉 ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి !

👉ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్ళి దాన్యం కొనుగోళ్ల కేంద్రాలను సందర్శించాలని ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.


బుధవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్ల విషయంపై జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ బి. ఎస్. లత లతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కటింగ్ పేరిట మిల్లర్లు ఎవరైనా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే వారి పైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ధాన్యం కొనుగోల్లు సాఫీగా జారిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, గన్నిబ్యాగ్స్ కొరత లేకుండా అందుబాటులో ఉండే విధంగా చూడాలని అన్నారు. ధాన్యం రవాణా విషయంలో లారీల కొరత లేకుండా చూడాలని, ప్యాడి ఎక్కువగా వచ్చే సెంటర్లో ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

క్లీనింగ్ మిషనరీ కానీ మ్యాచ్రు ధాన్యాన్ని వెంట వెంటనే ధాన్యాన్ని రవాణా చేయాలని ఐకెపి సెంటర్లలో హమాలీల ఇబ్బంది లేకుండా క్లీనింగ్ మిషన్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. తాలు, తప్ప, తరుగు వంటివి క్లీనింగ్ అయిన తర్వాత రైతులకు తరుగు లేకుండా ధాన్యాన్ని సేకరించాలని తెలిపారు.

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రస్తుత సీజన్ ప్యాడ్ ని ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అధికారులు సహకరించాలని ఆదేశించారు.


ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్. లత, DSO, DMO, అగ్రికల్చర్ ఆఫీసర్, ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.