👉కులాలపై తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలకు సిఫార్సు చేస్తాం..
👉ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నది బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు బహిరంగ విచారణ !
👉బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ !
J.SURENDER KUMAR,
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నవంబర్ 6 నుంచి చేపడుతున్న కుల గణన సమగ్ర కుటుంబ సర్వే ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుందని బిసి కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ వెల్లడించారు. ఇది బృహత్తర కార్యక్రమాన్ని ఇందులో ఎవరు మిస్ కాకుండా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను ఖరారు చేసే చేసే అంశంపై కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో బహిరంగ విచారణ నిర్వహించారు.
10 గంటల నుంచి 7 గంటల వరకు వివిధ బీసీ కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. వారి సమస్యలను ఓపిగ్గాగా చైర్మన్ తో పాటు సభ్యులు ఆలకించారు. దాదాపు 9 గంటల పాటు ఓపికగా అందరి నుంచి విన్నపాలు అందుకున్నారు.

👉సాయంత్రం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు జరుగుతదో తెలియదని, రాష్ట్రంలో ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారు బీసీలు ఓసీలు, ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు సంచార జాతులు ఎంతమంది ఉన్నారో ఈ సర్వే ద్వారా వెళ్లడవుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం చిత్తశుద్ధితో రాష్ట్రంలో ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితిని అంచనా వేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రజలందరూ ఈ సర్వేను విజయవంతం చేయాలని కోరారు. ప్రజల ఆశలను బీసీ కమిషన్ మమ్ము చేయదని, వారి ఆశయాల కనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఎవరి ఒత్తిడి కి తలోగ్గే ప్రసక్తి లేదని, బీసీల రిజర్వేషన్ అంశంపై ఉన్నది ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించిన విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
దీనికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. తాము ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తున్నామని చెప్పారు. ఎక్కడ కూడా ఇలాంటి ఒత్తిళ్ళకు లొంగకుండా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. చిత్తశుద్ధితో పని చేస్తున్నామనీ, ఎవరికి భయపడమనీ, ఎలాంటి తయిలాలు ఆశించేది లేదు.. ఆత్రుత పడేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నవంబర్ 6 నుంచి 90 వేల మంది ఎన్యుమారేటర్లతో సమగ్ర కుటుంబ సర్వే జరపబోతున్నదని తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కుల సంఘాలు, ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని ఎవరినీ ఇందులో నుంచి విస్మరించవద్దని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించకుండా సర్వేకు సహకరించాలని కోరారు.
కోర్టులంటే తమకు అపార గౌరవం ఉన్నదని, వాటి ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తామన్నారు. బీసీ కమిషన్ నిర్విఘ్నంగా బీసీల సామాజిక ఆర్థిక పరిస్థితులను పర్యవేక్షించేందుకు నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. బీసీలకు సంబంధించిన అనేక సమస్యలు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. వాటిపై సమగ్రంగా క్రోడీకరించి తగిన నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలు సహకరించాలని, బీసీ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజల వెంట ఉండాలని సూచించారు. గత బిఆర్ఎస్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఎక్కడుందో ఆ దేవుడు కూడా తెలియదన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను ఎన్యుమారేటర్లు చాలా జాగ్రత్తగా నిర్వహించాలని, ఎవరైనా కులాలపై తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. సమగ్ర సర్వేలో ఎన్యుమరేటర్లు ఉన్నది ఉన్నట్లు వివరాలు నమోదు చేయాలని సూచించారు.
బహిరంగ విచారణలో పేరు తెలియని కులాలు సైతం తమ దృష్టికి వచ్చాయని, వారి బాధలు హృదయ విదారకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. సామాజిక ఆర్థిక రాజకీయపరమైన అన్ని విషయాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు.
👉బీసీ కమిషన్ సభ్యుడు రాపోలు జయప్రకాశ్ రావు మాట్లాడుతూ
బహిరంగ విచారణలో బీసీ కులాలు, జాతుల్లో నెలకొన్న ఆవేదన తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. తమ కమిషన్ పట్టుదలతో బీసీలకు రిజర్వేషన్ల కల్పనకు ముందుకెళ్తుందని తెలిపారు.
👉బీసీ కమిషన్ సభ్యురాలు రంగు బాల లక్ష్మి మాట్లాడుతూ
కొన్ని దశాబ్దాల ప్రజల కల రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చబోతున్నదని తెలిపారు. అన్ని కులాల లెక్క తేలేందుకు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నదని తెలిపారు. ప్రజల జీవన విధానాలపై, ఆర్థిక స్థితిగతులు అన్నింటిపై వివరాలు సేకరిస్తున్నదని పేర్కొన్నారు. ఈ సర్వేను ప్రజలందరూ విజయ వంతం చేయాలని ఏ ఒక్కరు మిస్ కావద్దని కోరారు.
👉 బీసీ కమిషన్ సభ్యుడు తిరుమలగిరి సురేందర్ మాట్లాడుతూ
సమగ్ర కుటుంబ సర్వేను ఎన్యూమరేటర్లు పకడ్బందీగా, ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సర్వే తోనే విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ల ప్రజల, భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు.
👉కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ

ప్రజల సంక్షేమానికి నవంబర్ 6 నుంచి ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేను ప్రజలంతా కలిసికట్టుగా విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. బీసీల రిజర్వేషన్ అమలుకు విచారణ జరిపేందుకు బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులు జిల్లాలో పర్యటించారని తెలిపారు. బీసీ కులాల ప్రతినిధులు, నాయకులు,ప్రజల నుంచి అన్ని వివరాలను విజ్ఞప్తులను వారు స్వీకరించారని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే కి సంబంధించిన హౌస్ లిస్టింగ్ ఎక్ససైజ్ శుక్రవారం నిర్వహించామని వెల్లడించారు. వెనుకబడిన తరగతుల వారి ఆవేదనను బీసీ కమిషన్ ఆలకించిందని చెప్పారు. వైద్య, ఉద్యోగ రాజకీయ పరంగా వారికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఏ ఒక్కరూ మిస్ కాకుండా అందరి వివరాలు నమోదు చేసేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు.
👉జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ

కులగణన సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ముందుకెళ్తున్నదని తెలిపారు. బీసీల రిజర్వేషన్ల అమలుకు సంబంధించి బీసీ కమిషన్ సభ్యులు విచారణ జరిపారని చెప్పారు. ఇందులో బిసి కులాల ప్రతినిధులు ప్రజాప్రతినిధులు అన్ని వివరాలు వారికి అందజేశారని పేర్కొన్నారు.
👉బీసీ కమిషన్ కీ వచ్చిన విజ్ఞప్తులు
👉కరీంనగర్. 99
👉జగిత్యాల. 29
👉పెద్దపల్లి 32
👉సిరిసిల్ల 53
మొత్తం 213
ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, పెద్దపల్లి కలెక్టర్ శ్రీ కోయ హర్ష, జగిత్యాల,కలెక్టర్ సత్య ప్రసాద్ సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అదనపు కలెక్టర్లు, జిల్లా ఉన్నత అధికారులు బీసీ సంక్షేమ శాఖ అధికారులు,పాల్గొన్నారు.