👉 కలెక్టర్ బి. సత్య ప్రసాద్ !
J.SURENDER KUMAR,
ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సూచించారు. (స్వీప్)ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం – 2025 లో భాగంగా జగిత్యాల జిల్లావ్యాప్తంగా శనివారం, రేపు (ఆదివారం) నవంబర్ 10 వరకు ప్రత్యేక ఓటరు నమోదు నిర్వహిస్తున్నామని తెలిపారు.
👉జనవరి 1వ తేదీ 2025 నాటికి 18 సంవత్సరాలు నిండే యువత, కొత్త ఓటర్ గా నమోదు చేసుకునేందుకు,మార్పులు సవరణకు,వెలువడిన ఓటరు జాబితాలో అభ్యంతరాల తెలిపేందుకు కోసం బూత్ లెవల్ ఆఫీసర్లు తమ బూత్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారన్నారు.
👉 నూతన ఓటరు గా నమోదుకు ఫామ్ -6, అక్టోబర్ 29 న విడుదల చేసిన ఓటర్ ముసాయిదా లో అభ్యంతరాల కోసం ఫారం – 7, సవరణలకు ఫారం – 8 దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
👉ప్రజలు. ఆన్లైన్లో voters.eci.gov.in వెబ్సైటు ద్వారా కూడా దరఖాస్తూ చేసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు.