రేపు ధర్మపురి క్షేత్రంలో ట్రాఫిక్ ఆంక్షలు !


J.SURENDER KUMAR,


ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం (15 నవంబర్) ట్రాఫిక్ నియంత్రణ ఆంక్షలను అమలు చేయనున్నట్లు ధర్మపురి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నర్సింహారెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.


ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి, గోదావరి నదిలో పవిత్ర స్నానాలు చేయడానికి స్థానిక బ్రహ్మ పుష్కరిణిలో ( కోనేరులో ) పంచ సహస్ర దీపాలను తిలకించడానికి భారీ సంఖ్యలో క్షేత్రానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.


👉వాహనాల పార్కింగ్…


ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు ద్వారా వచ్చే భక్తుల వాహనాలను బ్రాహ్మణ సంఘం, ఇసుక స్తంభం, నంది చౌరస్తా, వైశ్య సత్రం ల నుండి వాహనాలను శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు అనుమతించబడవు.
వాహనాలలో వచ్చే భక్తులు తమ వాహనాలను నంది చౌరస్తా, కూరగాయల మార్కెట్ వద్ద, హరిత హోటల్ ప్రక్కన, మంగలిగడ్డ వద్ద, బ్రాహ్మణ సంఘం వద్ద ఏర్పాటు చేసిన వాహన పార్కింగ్ స్థలాలలో వారి వాహనాలను పార్కింగ్ స్థలంలో నిలుపుకోవాలని పోలీసు శాఖ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.


దైవ దర్శనానికి మరియు గోదావరి స్నానానికి, కోనేరు కు కాలినడకన వెల్లవలసిందిగా భక్తులకు ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. భక్తులు పోలీస్ శాఖకు సహకరించగలరని ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామ్ నర్సింహారెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.