రోడ్డు ప్రమాదల నివారణకు చర్యలు చేపట్టండి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదల నివారణకు అధికారులు పరిశీలించి సాంకేతిక మరమ్మతు విధానాలతో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను కోరారు.


తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న వెల్గటూరు మండలం ముత్తునూర్ గ్రామానికి చెందిన ఇరిగేషన్ లిఫ్ట్ కొనసాగుతున్న ప్రదేశాన్ని అధికారులు నాయకులతో కలిసి గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు.


ఈ సందర్భంగా స్థానిక నాయకుల ద్వారా రోడ్డు ప్రమాదాలు సంభవించడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, గుంతలు పూడ్చాలని సూచించారు..