👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
మా ప్రభుత్వం అధికారం చేపట్టి కొన్ని నెలల్లోనే 85 శాతం మంది రైతాంగం కు రుణమాఫీ చేశామన్నారు. మిగతా 15 శాతం మంది రైతులకు రుణ మాఫీ చేస్తామని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి మండలం నక్కలపేట, ధర్మారం మండలంలోని ఎర్రగుంటపల్లె గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం అధికారులు
మండల నాయకులతో కలిసి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .

ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు సాఫీగా కొనసాగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్న రకం వడ్లకు ఐదు వందల రూపాయల బొనస్ కూడా ఇవ్వడం జరుగుతుందని, వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు.