👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
సహకార సంఘాలు రైతాంగం సంక్షేమం కోసం సహాయ సహకారాలు అందిస్తూ కృషి చేయాలని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ ఎల్ గార్డెన్స్ లో గురువారం సహకార సంఘాల ఆధ్వర్యంలో జరిగిన 71 వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో కార్యక్రమంలో ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
సహకార సంఘాల వారోత్సవాల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఉమ్మడి జిల్లా రైతాంగానికి మేలు జరిగే విధంగా సహకార సంఘాలు గాని, సహకార సంఘాల బ్యాంకులు పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు.
వరి ధాన్యం కొనుగోలు లో దాదాపు 270 కి పైగా సొసైటి ల ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతుల పై అదనపు భారం పడకుండా సొసైటిల ద్వారానే మిల్లర్లు వరి ధాన్యం కొనుగోలు చేసే విధంగా దృష్టి సారించాలని, దీనికి ప్రభుత్వం తనవంతు సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.