👉ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ భూముల సర్వే అంశాలపై అధికారులతో సమీక్ష !
👉ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్!
J.SURENDER KUMAR,
ధర్మారం మండలంలో చేపట్టిన ప్రభుత్వ భూముల సర్వే ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మంగళవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి ధర్మారం మండలంలోని ప్రభుత్వ భూముల సర్వే, ధాన్యం కొనుగోలు అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మారం మండలంలోని భూమి లేని నిరుపేదలకు అసైన్మెంట్ భూమి పంపిణీ చేసే దిశగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ భూముల సర్వే ప్రక్రియను చేపట్టామని అన్నారు. ధర్మారం మండలంలో ఉన్న ప్రభుత్వ భూముల సర్వే ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.
ధర్మారం మండలం పరిధిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. రైతులకు ఎక్కడ ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకోవాలని, రైస్ మిల్లుల వద్ద ధాన్యం కోత ఎక్కడ జరగడానికి వీలు లేదని అన్నారు.

కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం నాణ్యత ప్రమాణాలు పరిశీలించి నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు ఎప్పటికప్పుడు జరగాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర టార్ఫాలిన్ కవర్లు, గని సంచులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, హమాలీల కొరత ఎక్కడ రాకుండా చుట్టుకోవాలని అన్నారు.