శ్రీ వాణి దర్శనం అదనంగా వంద టికెట్లు !

J.SURENDER KUMAR,


తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం జారీ చేస్తున్న ఆఫ్‌లైన్ కోటాను తగ్గించి, రేణిగుంట విమానాశ్రయంలో ఇచ్చే శ్రీవాణి టిక్కెట్ల కోటాను 100 నుండి 200 కు పెంచినట్లు టిటిడి ప్రకటనలో పేర్కొంది.


అదనంగా పెంచిన టిక్కెట్లు నవంబర్ 22 నుండి అమల్లోకి రానుంది. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనుక ఏర్పాటు చేసిన కౌంటర్లలో టీటీడీ ప్రతిరోజూ 900 శ్రీవారి టిక్కెట్లను ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తుండేవారు

శుక్రవారం నుంచి తిరుమలలో 800, టికెట్లు తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో 200 టిక్కెట్లు ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రాతిపదికన జారీ చేయనున్నారు. ఈ సవరణలను భక్తులు గమనించవలసిందిగా టిటిడి ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.