👉యమ ద్వితీయ సందర్భంగా..
J.SURENDER KUMAR,
”యమద్వితీయ” పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీలక్ష్మి నరసింహ స్వామి అనుబంధ ఆలయం లో ఆదివారం శ్రీ యమ ధర్మరాజు కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రుద్రాభిషేకం, మన్య సూక్తం, ఆయుష్య సూక్తం తో అబిషేకం , ఆయుష్య హోమం హరతి మంత్రపుష్ప కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి.

👉యమ ద్వితీయను, భగినీ హస్త భోజన పర్వదినంగా..
భారతీయ సంప్రదాయంలో రక్తసంబంధాలకీ, అనుబంధాలకీ ఇచ్చే ప్రాధాన్యత కు నిదర్శనం యమ ద్వితీయ అంటారనేది పురాణ గాధ.
దీనిని భాతృవిదియ. భగినీ (సోదరి) హస్త భోజనం అంటారు. ఇది దీపావళి నుంచి రెండోరోజున వస్తుంది.
👉పురాణ కథనాలు..
పూర్వం యమునా నది తన సోదరుడి పై బెంగపట్టుకుందట. ఆ సోదరుడు ఎవరో కాదు., సాక్షాత్తూ మృత్యువుని అమలుపరిచే యమధర్మరాజు అందుకే యమున నదిని యమి అని కూడా పిలుస్తారు.

యముడు తన ఇంటికి వచ్చి చాలా రోజులైంది కాబట్టి, ఓసారి వచ్చి వెళ్లమని గంగానది ద్వారా యముడికి యమునా కబురుపెట్టింది.
యమధర్మరాజు వెంటనే యమునాదేవి ఇంటికి వెళ్లారు. అక్కడ యమున ఆయనను సాదరంగా ఆహ్వానించి, భోజనం పెట్టింది. చెల్లెలి అనురాగానికి సంతోషించిన యముడు, ఏం వరం కావాలో కోరుకోమన్నాడట. అందుకు యమున నువ్వు ఏటా ఇదే రోజున మా ఇంటికి వస్తే చాలు. అదే గొప్ప వరం అని యమునా నది తన సోదరుడు యమ ధర్మరాజును కోరింది.

యమధర్మరాజు తన సోదరికి వరం ప్రసాదిస్తూ ఎవరైతే ఈ రోజున తన సోదరి ఇంట్లో భోజనం చేస్తారో వాళ్లు అకాల మృత్యవు నుంచీ, నరకలోకం నుంచీ శాశ్వతంగా తప్పుకుంటారని వరం ప్రసాదించినట్టు కథనం. సోదరికి వైధవ్యం ప్రాప్తించదు అని కూడా వరాన్ని అందించాడట. అందుకే ఈ రోజుని యమద్వితీయ అంటారు అనేది కథనాలు.
ఉత్తరాదిన ఈ పండుగను భాయి దూజ్, భాయిటీకా, భాయితిహార్ వంటి భిన్నమైన పేర్లతో జరుపుకుంటారు.