శృంగేరి స్వామీజీని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ దంపతులు !

J.SURENDER KUMAR,

శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధు శేఖర భారతీ తీర్థ స్వామీజీని టిటిడి ఛైర్మన్  బిఆర్ నాయుడు దంపతులు దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం తిరుమలలోని శృంగేరి శారదా పీఠాన్ని చైర్మన్‌ తన సతీమణితో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా స్వామిజీ సభాపతిని, భార్యను ఆశీర్వదించారు. అనంతరం హిందూ సనాతన ధర్మాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.