సూర్యారావు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రులు !


J.SURENDER KUMAR,


గత వారం రోజుల క్రితం మృతి చెందిన ధర్మపురి ఆలయ మాజీ పాలకవర్గ చైర్మన్  స్వర్గీయ జువ్వడి సూర్యారావు  కుటుంబ సభ్యులను, మాజీ మంత్రులు గోడిసెల రాజేశం గౌడ్, మోతుకుపల్లి నరసింహులు పరామర్శించారు.


తిమ్మాపూర్ లో శనివారం ఆయన కూతురు జస్టిస్ శ్రీదేవిశ్రీహరి రావుల ను కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ, సూర్యారావుతో తమకున్న  స్నేహ సంబంధాలు, రాజకీయ సంఘటనలు తదితర అంశాలను మాజీ మంత్రులు గుర్తు చేసుకున్నారు.


మాజీ మంత్రులతో పాటు, నిర్మల్ జిల్లా ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు పడాల శ్రీనివాస్. సీనియర్ వైద్యులు డాక్టర్ రమేష్ రెడ్డి. గోవర్ధన్ రెడ్డి.VRO ల యునియన్ జిల్లా అధ్యక్షులు దిగంబరావ్. తెలంగాణ ఉద్యమ కారుల JAC జిల్లా అధ్యక్షుడు కొట్టే శేఖర్ నిర్మల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేష్,  జీవన్ శంకర్ లు పరామర్శించారు.