తిరుమల డంప్ యార్డులో చెత్తను మూడు నెలల్లో తొలగిస్తాం !


👉టీటీడీ కార్యనిర్వహణాధికారి !


J.SURENDER KUMAR,


టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావుతో పాటు అడిషనల్ ఈవో సిహెచ్. తిరుమలలోని పలు ప్రాంతాల్లో వెంకయ్య చౌదరి శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా
తిరుమల గోగర్భం రిజర్వాయర్ సమీపంలోని కాకుల్మాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలలు తొలగిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జే. శ్యామల రావు అన్నారు.


టీటీడీ ఈవో తోపాటు అడిషనల్ ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి తిరుమలలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. దశాబ్ద కాలంగా పేరుకుపోయిన చెత్తను మూడు నెలల్లో తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఈఓ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో 30 ఏళ్ల నుంచి పేరుకుపోయిన లక్ష మెట్రిక్‌ టన్నుల చెత్తను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.


పేరుకుపోయిన చెత్త నుంచి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకుంటామని, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను తరలించేందుకు తిరుపతి మున్సిపాలిటీ అధికారులతో చర్చించామని, ఇప్పటికే మున్సిపల్ అధికారులు డంపింగ్ యార్డును సందర్శించారని తెలిపారు.


అనంతరం మాట్లాడుతూ మూడు నాలుగు నెలల్లో చెత్త మొత్తం తొలగిస్తామని, భవిష్యత్తులో శాస్త్రీయంగా చెత్త వేసే విధానాన్ని అమలు చేస్తామన్నారు. వేల టన్నుల తడి చెత్త ఉందని, ఐఓసీఎల్ బయోగ్యాస్ ప్లాంట్ ఎత్తివేస్తే తడి చెత్త తగ్గుతుందన్నారు. తడి చెత్తతో ఇప్పటికే సుమారు 20 వేల టన్నుల కంపోస్టును సిద్ధం చేశామన్నారు. పాపనినాశనం చేరుకున్న ఈఓ మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, పార్కింగ్ స్థలాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.


అలాగే పాపవినాశనంలోని సైన్ బోర్డులకు రంగులు వేసి పార్కులను అభివృద్ధి చేయాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. పాపవినాశనం టోల్ గేట్ వద్ద జారీ చేసిన టోల్ రశీదులను కూడా ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఈ ఓ అంశాలన్నింటినీ ఆకాశగంగ తీర్థంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఆకాశగంగ మెట్ల మార్గంలో ఉన్న దుకాణాల ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. టిటిడి సిఇ సత్యనారాయణ, ఇఇ సుధాకర్, ట్రాన్స్‌పోర్ట్ జిఎం శేషారెడ్డి, డివై సిఎఫ్0 శ్రీనివాస్, డిప్యూటీ ఇఓ శ్రీమతి ఆశాజ్యోతి, విజిఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.