తిరుమలలో రోజుకు తొమ్మిది వందల శ్రీవాణి దర్శన్ టికెట్లు!

👉టిక్కెట్ల కోసం కొత్త కౌంటర్‌ను ప్రారంభించిన టిటిడి అదనపు ఈ వో వెంకయ్య చౌదరి !


J.SURENDER KUMAR,


ఇకపై శ్రీవాణి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిక్కెట్లు పొందవచ్చని తెలిపారు. ఆఫ్ లైన్ లో రోజుకు 900 టిక్కెట్లు కేటాయిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.


తిరుమలలో శ్రీవాణి దర్శనం టిక్కెట్లను ఆఫ్‌లైన్‌లో కేటాయించే ప్రక్రియను సులభతరం చేసినట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. బుధవారం ఉదయం గోకులం సమావేశ మందిరం వెనుక భాగంలో శ్రీవాణి దర్శనం టిక్కెట్ల నూతన కౌంటర్లను ఆయన ప్రారంభించారు.

కౌంటర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తుడి వివరాలను స్వయంగా తీసుకుని మొదటి టికెట్‌ను కేటాయించారు.


ఈ సందర్భంగా అడిషనల్ ఈఓ మీడియాతో మాట్లాడుతూ.. వర్షం కురువడంతో గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూలైన్లలో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నట్లు గుర్తించి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు.


గతంలో టిక్కెట్లు కేటాయించేందుకు మూడు నాలుగు నిమిషాల సమయం పట్టేదని, ఇప్పుడు ఒక్క నిమిషంలోపే భక్తులకు టికెట్లు కేటాయించేలా దరఖాస్తును సరళతరం చేశారు.

ఐదు కౌంటర్ల ద్వారా భక్తులు సులభంగా టిక్కెట్లు కొనుగోలు చేసుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో రాజేంద్ర, వీజీవో సురేంద్ర, ఏఈవో శ్రీకృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.