తోలు పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


రాష్ట్రంలో తోలు పరిశ్రమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGLIPC)- ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సదస్సులో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.


తెలంగాణలో తోలు మరియు సంబంధిత అనుబంధం పరిశ్రమల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అట్టి పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని,. నూతనంగా ఆవిర్భవించిన స్కిల్ అర్హులకు సాంకేతిక శిక్షణ తదితర అంశాలు ముఖ్యమంత్రి సంబంధిత పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేయనున్నారని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సదస్సులో వివరించారు.