టీటీడీ చైర్మన్ గా బి ఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం !

J.SURENDER KUMAR,


తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా  బిఆర్ నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

తిరుమల ఆలయంలోని బంగారు వాకిలిలో శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో టీటీడీ ఈవో జె శ్యామలరావు ప్రమాణం చేయించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలసి పీఠాధిపతిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో ఆయనకు వేదపండితులు వేదశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు, స్వామివారి ల్యామినేషన్‌ ఫొటో, టీటీడీ క్యాలెండర్లు, డైరీలు అందజేశారు.

టీటీడీ చైర్మన్ఆ బి ర్ నాయుడు..

ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి  బిఆర్ నాయుడు శ్రీ భూ వరాహ స్వామి, స్వామి పుష్కరిణి దర్శనం చేసుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ మీదుగా ఆలయ మహాద్వారం చేరుకున్నారు. ఆలయ ముఖద్వారం వద్ద ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం దేవాదాయ శాఖ కార్యదర్శి  సత్యనారాయణ, శ్రీమతితో టీటీడీ అడిషనల్ ఈవో  సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు.

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జంగా కృష్ణమూర్తి,  మల్లెల రాజశేఖర్ గౌడ్,  జాస్తిపూర్ణ సాంబశివ రావు,  MS రాజు,  నర్సి రెడ్డి,  బూగునూరు మహేందర్ రెడ్డి, శ్రీమతి. అనుగోలు రంగ శ్రీ, ఆనంద్ సాయి, శ్రీమతి. TTD ట్రస్ట్ బోర్డు సభ్యులుగా జానకీ దేవి తమ్మిశెట్టి,  RN దర్శన్,  M. శాంతారామ్,  S. నరేష్ కుమార్ మరియు Dr. ఆదిత్ దేశాయ్. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు, తీర్థప్రసాదాలు అందజేయగా, టీటీడీ అధికారులు శ్రీవారి చిత్రపటం, డైరీలు, క్యాలెండర్లు, తీర్థప్రసాదాలు అందజేశారు.

కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవోలు  లోకనాథం, భాస్కర్, శ్రీమతి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.