J.SURENDER KUMAR,
నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి ఉన్నత విద్య ఎంబిబిఎస్ లో సీటు సాధించారు. ప్రోత్సాహకంగా విద్యార్థికి ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి ఆదివారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ఆర్థిక సాయం అందించారు.
గొల్లపల్లి మండలంలోని రాపల్లె గ్రామానికి చెందిన విద్యార్థి కాట్కూరి మహేందర్, నిర్మల్ ప్రభుత్వ కళాశాలలో MBBS సీటు సాధించాడు. మహేందర్ ఆర్థిక పరిస్థితిని పలువురు ఎమ్మెల్యేకు వివరించారు. స్పందించిన కాంత కుమారి విద్యార్థిని అభినందించి ట్యూషన్ ఫీజు నిమిత్తం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు