వంట గ్యాస్ లీకేజి మృతుడికి 6 లక్షల నష్టపరిహారం !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ధర్మారం మండల కేంద్రానికి చెందిన బొడిగే మల్లేశం వంట గ్యాస్ లీకేజీ ప్రమాదంలో మృతి చెందగా ఆ కుటుంబానికి ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ₹ 6.75,500/- లక్షల చెక్కును అందించారు.


రెండు సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు వంట గ్యాస్ లీకేజి లో మృతి చెందడు వారికి గ్యాస్ ఏజెన్సీ నుండి మంజూరు అయినా ₹ 6 లక్షల 75 వేల 5 వందల రూపాయల చెక్కును గ్యాస్ ఏజెన్సీ అధికారులు, మండల నాయకులతో కలిసి మృతుడు భార్య మానస కు స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో అందించారు.


👉ప్రారంభోత్సవం..


మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వసుధర ట్రెడర్స్ (పర్టీ సైడ్ & సీడ్స్) షాప్ ను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. యాజమాన్యానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.


👉₹ 1.30 కోట్ల పనులకు భూమి పూజ.


ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామంలో మంగళవారం CRR గ్రాంట్ నిధుల ద్వారా బొమ్మిరెడ్డి పల్లె హనుమాన్ టెంపుల్ నుండి కొత్తపల్లి గ్రామపంచాయతీ వరకు దాదాపు కోటి 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోయే బిటి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు.