వర్గీకరణ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


వర్గీకరణ అమలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని త్వరలో వాటి ఫలాలు మనకు దక్కుతుందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని శనివారం స్థానిక NG కళాశాల మైదానంలో జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, తదితర మాదిగ ప్రజాప్రతితులు మాజీ ఎమ్మెల్యేల తో కలిసి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించడానికి, మన ఆర్థిక స్థితిగతులు, విద్య ఉద్యోగ రాజకీయ ప్రాధాన్యత తదితర అంశాలు వివరించడానికి దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రముఖ న్యాయవాదులను ప్రభుత్వం నియమించడం జరిగిందన్నారు. పెద్దలు మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ, తాను, తదితర మాదిగ ప్రజాప్రతినిధులు వారి వెంట ఢిల్లీకి వెళ్దామని వివరించారు.


కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణను తూచా తప్పక అమలు చేస్తూ మన యువతకు విద్య ఉద్యోగ రాజకీయ ప్రాధాన్యత లలో సముచిత స్థానం లభిస్తుందని లక్ష్మణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.