వైద్యం కోసం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ 50 వేల ఆర్థిక సహాయం !

J.SURENDER KUMAR,


రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేక అవస్థ పడుతున్న కాంగ్రెస్ కార్యకర్త వైద్యం కోసం ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ₹ 50 వేల ఆర్థిక సహాయం అందించారు.


వివరాలు ఇలా ఉన్నాయి..


ధర్మపురి పట్టణానికి చెందిన యూత్ కాంగ్రెస్ కార్య కర్త ముప్పట్ల నిరంజన్ గత వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు.
గత మూడు రోజుల క్రితం ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రుడు నిరంజన్ ను ఎమ్మెల్యే పరామర్శించారు.


ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మంగళవారం హైదరాబాద్ లో రాహుల్ గాంధీ సమావేశ కార్యక్రమంలో పాల్గొనడంతో, ఫోన్ ద్వారా నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన శస్త్ర చికిత్స, మెరుగైన వైద్యం కోసం పట్టణ కాంగ్రెస్ నాయకుడు వేముల రాజు, సాగర్ తో నిరంజన్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు
.