J. SURENDER KUMAR,
గురుకుల విద్యార్థులు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి విద్యార్థి కృషి పట్టుదలతో చదివి ఉన్నత స్థానంలో ఉండాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,బిసి మైనార్టీ గురుకుల పాఠశాలలో డైట్ మరియు కాస్మొటిక్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానీకి ధన్యవాదాలు తెలిపే విధంగా వెల్గటూర్ మండలంలోని స్థంభంపెల్లి మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ బిసి సంక్షేమ గురుకుల విద్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.

రాష్ట్రంలో ఉన్న అన్ని గురుకుల పాఠశాలలో డైట్ మరియు కాస్మొటిక్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి భట్టికి, సంబంధిత శాఖ మంత్రులకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
,గత ప్రభుత్వంలో గురుకులాలను నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల గురించి పట్టించుకోలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంలో వారి కాస్మొటిక్ మరియు డైట్ చార్జీలను పెంచడం జరిగిందని, అదే విధంగా పాఠశాల కు సంబంధించి కొన్ని సమస్యలను నా దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని,విద్యార్థులకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న నా దృష్టికి తీసుకురావాలనీ ఈ సందర్భంగా తెలిపారు..
ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.