J.SURENDER KUMAR,
ధర్మపురి క్షేత్రంలోని శ్రీ గాయత్రి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ఎనిమిదవ వార్షికోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది.

యెనిమిది సంవత్సరాల క్రితం రిటైర్డ్ బ్రాహ్మణ ఉద్యోగులు తమ పెన్షన్ డబ్బులను విరాళంగా ఇస్తూ ధర్మపురి క్షేత్రంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ఏర్పాటుకు అంకురార్పణ చేశారు.

ధర్మపురి గోదావరి నది పవిత్ర స్నానాలకు, స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి నీ దర్శించుకోవడానికి నిత్యం తరలివచ్చే తమ సామాజిక భక్తజనంకు సాంప్రదాయబద్ధంగా ఉచిత భోజన సదుపాయాలను కల్పించడం వీరి ప్రధాన ఆశయం.

గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్న అన్నదాన సత్రం వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నగర సంకీర్తన, సత్ర భవనంలో రుద్రాభిషేకం వేదమంత్రాల తో ఘనంగా నిర్వహించారు.
👉 ఆత్మీయ వనభోజనం..

తిమ్మాపూర్ రైస్ మిల్ ప్రాంగణంలో గల మామిడి తోటలో బ్రాహ్మణ ఆత్మీయ వన భోజన కార్యక్రమం జరిగింది. కార్తిక పురాణ ప్రవచనం, సంగీత విభారి, కార్యక్రమాలు జరిగాయి,

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆస్థాన సంగీత విధ్వంసుడు ( పదవి విరమణ చేసిన ) కొంటికర్ల రామయ్య శర్మ దంపతులు, ఆత్మీయ భోజనం ఏర్పాట్లు చేశారు. వందలాదిమంది బ్రాహ్మణ దంపతులు, సుహాసిని వనభోజనాధి కార్యక్రమంలో పాల్గొని ఉల్లాసంగా గడిపారు.
👉పురాణ ప్రవచనం..

శ్రీ శారద మహిళా మండలి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోనీ శేషప్ప కళావేదిక పై శ్రీమతి గర్రెపల్లి శకుంతల దేవి కార్తీక మాసం విశిష్టత ఓకే పురాణ ప్రవచనం చేశారు.

ఆలయ, శారదా మహిళ మండలి పక్షాన శకుంతలదేవి సన్మానించారు.
