వరంగల్ కాకతీయుల చారిత్రక నగరం !

👉అభివృద్ధి బాటన నడిపించడానికి నడుం బిగించిన ప్రజా ప్రభుత్వం !


J.SURENDER KUMAR,

వరంగల్… కాకతీయ కాలం నుంచి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన నగరం. దశాబ్దకాలంగా నిర్లక్ష్యపు నీడలు. తెలంగాణలో రాజధాని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం. చారిత్రక నగరాన్ని అభివృద్ధి బాటన నడిపించడానికి నడుం బిగించిన ప్రజా ప్రభుత్వం !


👉ప్రజా పాలన తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.


👉2041 మాస్టర్ ప్లాన్ తో వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.!


👉వరంగల్ మహా నగరం అబివృద్దికి గతంలో ఎన్నడూ లేని విధంగా ₹ 4962.47 కోట్లు కేటాయించింది.!


👉ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  ఆదేశాల తో వివిధ విభాగాల పరిధిలో నగరంలో చేపట్టే పనులకు ఈ నిధులు మంజూరు చేసింది.!


👉వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ : ₹ 4,170 కోట్లు!


👉మామునూరు ఎయిర్ పోర్ట్ భూసేకరణ: ₹ 205 కోట్లు.!


👉కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ : ₹ 160.92 కోట్లు.!


👉టెక్స్ టైల్ పార్కు లో రోడ్లు, స్కూల్స్, సదుపాయాలు ..₹ 33.60 కోట్లు!


👉టెక్స్ టైల్ పార్క్ కు భూములు ఇచ్చిన రైతులకు 863 ఇందిరమ్మ ఇండ్లు.. ₹ 43.15 కోట్లు.!


👉కాళోజీ కళాక్షేత్రం ₹ 85 కోట్లు.!


👉పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణ : ₹ 65 కోట్లు.!


👉నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణం: ₹ 8.3 కోట్లు

👉వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ₹ 32.50 కోట్లు !


👉ఇన్నర్ రింగ్ రోడ్: ₹ 80 కోట్లు !


👉భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ కాలేజీ న్యూ బిల్డింగ్ : ₹ 28 కోట్లు !


👉గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు : ₹ 49.50 !
👉వరంగల్ ఉర్దూ భవన్, షాదీ ఖానా : ₹ 1.50 కోట్లు !