👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
యాదవుల సంస్కృతిక కు ప్రతీక సదర్ పండుగ అని, ప్రభుత్వం సదర్ పండుగను రాష్ట్ర పండు గగా గుర్తించడం అభినందనీయమన్నారు., యాదవులంతా ఒక్కటై రాజకీయాలకు అతీతంగా జాతి ఔన్నత్యాన్ని చాటిచెప్పే విధంగా సదరు ఉత్సవాలు జరుపుకోవడం సంతోషమని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం యాదవుల ఆధ్వర్యంలో జరిగిన సదర్ సమ్మేళనం మరియు గో పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు, రాజ్య సభ సభ్యుడు అనిల్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో యాదవ సోదరులు కలిసికట్టుగా నిర్వహించుకునే సదర్ ఉత్సవాల్లో పాల్గొన్నందుకు చాల సంతోషంగా ఉందన్నారు.