👉సీఎం రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ దేవస్థానాన్ని యాదాద్రికి బదులుగా భక్తులు పిలుచుకునే విధంగానే అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగానే వ్యవహారికంలోకి తీసుకురావాలి. అని సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రేవంత్ రెడ్డి దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అధికారులతో ఆలయ అభివృద్ధి చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు
👉యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (TTD) తరహాలో ట్రస్టు బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్షించి పలు సూచనలు చేశారు.

👉గోశాల నిర్వహణకు ఒక ప్రత్యేక విధానం తీసుకురావాలి. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించాలి.
గతంలో ఉన్నట్టుగానే భక్తులు కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి.
👉విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలి. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి కావాలి.
ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణను పూర్తి చేయడానికి వీలుగా నిధుల మంజూరు.
👉వారం రోజుల్లో పూర్తి వివరాలు, ప్రతిపాదనలు తయారు చేయాలి. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక అందించాలి.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ , ఉత్తమ్ కుమార్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు , కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.