J.SURENDER KUMAR,
ఎవరైనా అమ్మ, అక్క అని తిడితే ఆ గ్రామస్తులు తట్టుకోలేరు. చిన్న చిన్న గొడవల్లో, వాదోప వాదాలలో సైతం తల్లి , తోబుట్టువుల ను కించపరుస్తూ మాట్లాడితే ఎవరి తల్లి ఎవరి అక్క అయినా సరే అక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వారి పేర్లు ఉచ్చరించిన వారికి జరిమానా విధిస్తారు. గ్రామ ప్రజలు ఒక్కటే అలాంటి తిట్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా అహల్యానగర్ నెవాసా తాలూకాలో సౌందాల గ్రామం . ఆ గ్రామంలో దాదాపు1,800 మంది జనాభా. మహిళలను దుర్భాషలాడే వారిపై జరిమానాలు విధిస్తుండటంతో ఈ గ్రామం వార్తల్లో నిలిచింది.
గ్రామ కూడళ్లలో పెద్ద బ్యానర్ లు కట్టి దానిపై తీర్మానానికి సంబంధించిన వివరాలను రాశారు.

ఈ తీర్మానం హెడ్లైన్ ‘ఇది తల్లులు, అక్కాచెల్లెళ్ల గౌరవం కోసం’. మనం అమ్మ కడుపులో తొమ్మి నెలలు ఉంటాం అమ్మ దేహం పవిత్ర ఆలయం అలాంటి అమ్మను మహిళాల ను దూషించడం నేరం అంటూ బ్యానర్లలో పేర్కొన్నారు. అలా దూషించిన వారికి ₹ 500 జరిమానా విధిస్తూ గ్రామ ప్రజల సమిష్టి గా తీర్మానం చేశారని అని సర్పంచ్ శరద్ అరగ డే మీడియాకు వివరించారు.

ఇలాంటి నిర్ణయాలను భావితరాల కోసం కఠినంగా అమలు చేయాలని గ్రామస్తులు నిర్ణయం అని సర్పంచ్ వివరించారు.
“పెద్దలను దుర్భాషలాడినపుడు, లేదా అనుచితమైన భాషను ఉపయోగించినప్పుడు పిల్లలు దానిని అనుకరిస్తారు” అనేది గ్రామస్తులు భావన.

అంతేకాదు, పాఠశాల విద్యార్థులు రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య మొబైల్ ఫోన్లు వాడకుండా ఆంక్షలు విధించాలని గ్రామ పంచాయతీ నిర్ణయించింది. ఈ నిబంధనలు అమలు లో కొనసాగుతున్నాయి.