అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోనీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.


లోక్ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ పై చేసిన విమర్శలకు నిరసనగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పిలుపు మేరకు మంగళవారం రోజున జగిత్యాల పట్టణంలోని జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీ లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జువ్వాడి నర్సింగరావు ,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయ ,జిల్లా యూత్ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.


మొదటగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు..


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
దేశ ప్రజలు అంబేద్కర్ ను భగవంతుని స్వరూపంగా భావిస్తారనీ, ఉన్నతస్థాయి పదవిలో ఉండి అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా మాట్లాడడం చాల బాధాకరమైన,ప్రజాస్వామ్య వాదులు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ వ్యతిరేకుల తీరును ఖండించాలనీ, అన్నారు.


వివిధ కులమతాలు సంస్కృతులు భాషలతో ఉన్న భారతదేశాన్ని ఐకమత్యంగా ఉంచి రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు అంబేద్కర్ ను, దేశానికి మార్గం చూపిన మహనీయుడు అంబేద్కర్ ను, బడుగు బలహీన వర్గాలకు అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం తపించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు.


,ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక విగ్రహాలు ఉన్న మహనీయుడు అంబేద్కర్ ను,వారి ఆశయాలు సాధనకు, స్ఫూర్తి కోసమే విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు.


ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు