అంబేడ్కర్‌ పై చేసిన వ్యాఖ్యానలు అమిత్‌షా స్థాయికి తగదు !

👉 ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


భారత రాజ్యాంగా నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగదని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


గురువారం అసెంబ్లీ లోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన ప్రదర్శనల అనంతరం ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు.


కేంద్రంలో ఒక బాధ్యత గల పదవిలో ఉండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల ఆగౌరవంగా మాట్లాడిన తీరు యావత్తు దేశ ప్రజలు గమనిస్తున్నారని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.

దళిత బడుగు బలహీన వర్గాల మార్గ నిర్దేశకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల మాట్లాడిన మాటలతో రాజ్యాంగంపై మీకు, మీ పార్టీకి ఉన్న గౌరవం తేటతెల్లమైందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.