👉ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా అంబేద్కర్ చేసిన చట్టం వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం అయిందని, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల వల్లనే ఈ రోజు తాను ధర్మపురికి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం వచ్చిందని, ఈ విగ్రహ ఏర్పాటులో సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిజేస్తున్నమని ఈ సందర్భంగా అన్నారు.
కార్యక్రమానికి ముందు అంబేద్కర్ యువజన సంఘం తిమ్మాపూర్ ఆధ్వర్యంలో నాయకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో దళిత సంఘల నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు