👉 నియోజకవర్గానికి రెండు నూతన 108 అంబులెన్స్ లు
👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రమాదాలు సంభవించి ఆపద సమయాలలో అంబులెన్స్ సేవలు బాధితుల ప్రాణాలు కాపాడతాయని, గ్రామీణ లకు అందుబాటులో ఉంటాయని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
నియోజకవర్గంలోని బుగ్గారం, వెల్గటూర్ మండలాలలో మంగళవారం నూతనంగా 108 అంబులెన్స్ వాహన సేవలను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన 108 అంబులెన్సులు నేటికీ కొసాగుతున్నాయని అన్నారు.

ధర్మపురిలో మాత శిశు ఆసుపత్రిని, జిల్లా సివిల్ ఆసుపత్రిలో ICU యూనిట్ ను త్వరలోనే ప్రారంభిస్తామని, నియోజక వర్గంలో వైద్య పరమైన ఎటువంటి అవసరం ఉన్న నా దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.
అనంతరం స్పోర్ట్స్ అథారటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిఎం కప్ లో భాగంగా బుగ్గారం మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాల కలశాల మైదానంలో నిర్వహిస్తున్న క్రీడ పోటీలను ప్రారంభించారు.

తదుపరి బుగ్గారం మండల ఎంపిడిఓ కార్యాలయంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన బుగ్గారం మండల ఎంపిడిఓ శ్రీనివాస్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి సేవలను గుర్తు చేసుకున్నారు..

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.