👉27 దేశాలలో 200 సంఘాలతో నెట్వర్క్ కలిగిన ఎంఎఫ్ఏ !
J.SURENDER KUMAR,
గత ముప్పయి ఏళ్లుగా అంతర్జాతీయ వలస కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్న మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) అనే ప్రముఖ సంస్థకు బోర్డు అఫ్ డైరెక్టర్ గా తెలంగాణకు చెందిన వలస కార్మిక నేత మంద భీంరెడ్డి ఎన్నికయ్యారు.
థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ లో శనివారం జరిగిన ఎంఎఫ్ఏ సర్వ ప్రతినిధి సభలో ఎన్నికలు జరిగాయి. ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అనే సంస్థకు భీంరెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు.
తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా, దక్షిణ ఆసియా నియోజకవర్గాల నుంచి ఇద్దరు చొప్పున ఆరుగురు డైరెక్టర్ లు ఎన్నికయ్యారు. త్వరలో వీరి నుంచి ఒకరిని చైర్మన్ గా ఎన్నుకుంటారు. ఈ కమిటీ కాల పరిమితి రెండు సంవత్సరాలు.
ఆసియా – పసిఫిక్ లోని 27 దేశాలలో 200 పై చిలుకు సంస్థలకు ఎంఎఫ్ఏ ప్రాతినిధ్యం వహిస్తోంది.
మైగ్రెంట్ ఫోరం ఇన్ ఆసియా అనేది… వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సామాజిక న్యాయం కోసం, అట్టడుగు గ్రామ స్థాయిలో పనిచేసే (గ్రాస్ రూట్స్) సంస్థలు, కార్మిక సంఘాలు, విశ్వాస ఆధారిత సమూహాలు (ఫేత్ బేస్డ్ ఆర్గనైజేషన్స్), వ్యక్తిగత హోదాలో పనిచేసే న్యాయవాదుల నెట్వర్క్ తో పని చేస్తుంది.
1994 నుండి ఎంఎఫ్ఏ ఆసియాలో బలీయమైన వలసదారుల హక్కుల నెట్‌వర్క్‌గా ప్రసిద్ధిగాంచింది.