అసెంబ్లీ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి !

J.SURENDER KUMAR,


రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డా. బి.ఆర్. అంబెడ్కర్  వర్ధంతి సందర్భంగా శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి చట్ట సభ ల ప్రజా ప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు.


తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి  గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి  ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

 శాసనమండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి ,డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ . ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి  దయానంద్ ,లెజిస్లేటివ్ సెక్రటరీ డా.వి నరసింహా చార్యులు‌ ,అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.