J.SURENDER KUMAR,
డా.బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్సలర్ ఆచార్య ఘంటా చక్రపాణి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
జర్నలిస్టుగా, విశ్లేషకుడిగా రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఘంటా చక్రపాణి, తెలంగాణ రాష్ట్రం లో మొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నియమించబడ్డారు. సర్వీస్ కమిషన్ లో చేపట్టిన సంస్కరణలు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చాయి.
👉సీఎంను కలిసిన దిల్ రాజ్ !

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన చైర్మన్ దిల్ రాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం లో మర్యాద పూర్వకంగా కలిశారు.