👉ఈ నెల నాలుగున పెద్దపల్లి పట్టణంలో..
👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్. !
J.SURENDER KUMAR,
ఈ నెల 4 న పెద్దపెల్లి పట్టణంలో జరగనున్న లో ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభలో ప్రజలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని సూచించారు ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కోరారు.
ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం లో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.
అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ..

👉రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో ప్రజలకు చేసిన మేలును, అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించడం జరుగుతుందని, అన్నారు.
👉అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చి మా ప్రభుత్వానికి అప్పగించాలని ఆరోపించారు. అయినప్పటికీ అప్పులను తీర్తుస్తూ,అట్టి అప్పులకు వడ్డిలను కడుతూ సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు.
👉కేటిఆర్, హరీష్ రావు మరికొంత మంది బి.ఆర్.ఎస్ నాయకులు ప్రభుత్వం పైన అసత్యాలను ప్రచారం చేస్తూ,.బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాగు నీటి విషయంలో తీవ్ర అన్యాయం చేసింది హరీష్ రావు కాదా ? అని ప్రశ్నించారు
👉ఈ ప్రాంతాకు చెందిన నీటి వనరులను దోచుకొని సిద్దిపేటకు, గజ్వేల్ కి తరలించడం జరిగిందని, పత్తీపాక రిజర్వాయర్ నిర్మిస్తామని ఇక్కడ నిద్ర చేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామి ఇప్పుడు ఎక్కడ పోయిందని, ఎమ్మెల్యే ప్రశ్నించారు.
👉ధర్మపురి నియోజక వర్గానికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, చెగ్యం నిర్వాసితులకు ₹18 కోట్ల రూపాయలు పరిహారం గాని, పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపులు గాని, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సముదాయం మంజూరు , ధర్మపురిలోనైట్ కాలేజ్ పునః ప్రారంభం, ఈ విధంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు వెళతామని ఈ సందర్భంగా అన్నారు.
👉పెగడ పెల్లి మండలంలో…

పెద్దపెల్లిలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువ వికాస్ బహిరంగ సభకు పెగడ పెల్లి మండల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
👉రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటిలను అమలు చేస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని, విజయవంతంగా ₹ 2 లక్షల రూపాయల రుణమాఫీని పూర్తి చేయడం జరిగిందని, కొంత మందికి కొన్ని సాంకేతిక కారణాల వలన మాఫీ కాలేదని, కానీ వారికి కూడా త్వరలోనే రుణమాఫీ చేస్థామని ఎమ్మెల్యే వివరించారు.

👉రైతులకు సంబంధించిన డబ్బులు సొసైటి వారు ఏం చేశారని అడిగినందుకు మా పైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనీ, రైతు భరోసా కూడా త్వరలోనే అమలు చేసి తీరుతామని, అన్నారు.
👉సంక్షేమ శాఖకు మంత్రిగా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్ ఒక్క వసతి గృహాన్ని అయినా నిర్మించారా ? అని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల సంక్షేమ విషయంలో ప్రభుత్వం ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.