👉వినియోగదారుల ఫోరం ఆదేశం !
J SURENDER KUMAR,
రవాణా చేసిన సరుకులు గమ్యస్థానానికి చేరుకుంటే. ఆ బాధ్యత స్వీకరించిన కార్గో రవాణా సంస్థ వినియోగదారుడికి వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని కరీంనగర్ జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు ఇచ్చింది.
వివరాలు ఇలా ఉన్నాయి..
సిరిసిల్ల మండలం బద్దెపల్లి గ్రామంలో సాయికృపాల్ టెక్స్‌టైల్స్ పేరుతో తన పవర్ లూమ్స్‌పై గ్రే క్లాత్ ఉత్పత్తి చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు.
2017 సెప్టెంబర్ 2 న పట్టణంలోని CNR కార్గో మూవర్స్ (బ్రాంచ్ ఆఫీస్) ద్వారా
M/s పద్మా టెక్స్‌టైల్స్, రాజస్థాన్ కు ఇన్‌వాయిస్ బిల్లు నెం.000073 కి పంపారు.
బేల్స్ ఆఫ్ గ్రే క్లాత్ మెటీరియల్ విలువ రూ.60, 000/-ఉంది. అట్టి మెటీరియల్ రాజస్థాన్ కు చేరలేదు. అనేకసార్లు స్థానిక CNR కార్గో మూవర్స్ (బ్రాంచ్ ఆఫీస్) కు సంప్రదించిన తమ బాధ్యత లేదంటూ మొండి కేశారు.
విసుగు చెందిన రాజేశం. 2019 జూలై మాసంలో జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది మెట్ట మహేందర్ ద్వారా న్యాయం కోసం వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.

కేసు పూర్వ పరాలు పరిశీలించిన ఫోరం సంబంధిత కార్గో సంస్థ రాజేశం కు ₹ 67,738/- 9% వడ్డీతో చెల్లించాలని, ఖర్చుల నిమిత్తం మరో ఐదు వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశిస్తూ ఫోరం న్యాయమూర్తి శ్రీమతి శ్రీలత, సభ్యులు సిహెచ్ వి నరసింహారావు ఆదేశాలు జారీ చేశారు.