కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ కార్యక్రమాలు గుండెకాయ !

👉 జర్నలిస్టులకు నిబంధనల మేరకు ఇంటి స్థలాలు కేటాయిస్తాను !

👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


కాంగ్రెస్ పార్టీకి అనుబంధ యూత్ కాంగ్రెస్ గుండెకాయ గా కార్యక్రమాలు చేపట్టడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అర్హులైన జర్నలిస్టులకు నిబంధనల మేరకు సీనియర్ జర్నలిస్టుల సలహాలు సూచనలతో జర్నలిస్టులకు నియోజకవర్గంలో నేనే ఇంటి స్థలాలు మంజూరు చేస్తానని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


గురువారం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రికలో సమావేశంలో మాట్లాడారు. ముందు గా ధర్మపురి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు నూతన ఎన్నికైన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను,ఉపాధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను సన్మానించారు.


👉ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ


గత యూత్ కాంగ్రెస్ ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్ అతడి బృందం నియోజక వర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి పార్టీ కష్ట కాలంలో అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ జెండాను విడిచిపెట్టకుండా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారని, ఈ సందర్భంగా ప్రసాద్ ను ఎమ్మెల్యే అభినందించారు.


అదే విధంగా నూతనంగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సైతం పార్టీ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. పెద్దపెల్లి పట్టణంలో జరిగిన యువ వికాస్ బహిరంగ సభలో పాల్గొనేందుకు తరలి వచ్చిన ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
ధర్మపురి నియోజక వర్గ నూతన అధ్యక్షులు అజయ్ ఉపాధ్యక్షులు, పాల గణేష్ , రాందేని మొగిలి, ధర్మపురి మండల యూత్ అధ్యక్షులు తిరుపతి,వెల్గటూర్ మండల యూత్ అధ్యక్షులు రమేష్, బుగ్గారం మండల యూత్ అధ్యక్షులు అంజిత్, గొల్లపెల్లి మండల యూత్ అధ్యక్షులు గౌతమ్, పెగడపెల్లి మండల యూత్ అధ్యక్షులు అనిల్, ధర్మారం మండల యూత్ అధ్యక్షులు తిరుపతి నియమితులు అయినా వారికి ఎమ్మెల్యే ఈ సంధర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.


సీఎం రేవంత్ రెడ్డి కి పెద్దపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డికి లో ధర్మపురి దేవాలయ అభివృద్ధికి ₹ 50 కోట్ల రూపాయలను, మరియు మురుగు నీటి వ్యర్థాలు పవిత్ర గోదావరి నదిలో కలవకుండా డ్రైనేజి లైన్ నిర్మాణానికి ₹ 17 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని, పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇచ్చిన వినతిపత్రం పై సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వివరించారు.